Sapta Bhajana at Kottalapalli Shiva Temple Sapta Bhajana at Kottalapalli Shiva Temple
సప్త భజన కొట్టాలపల్లి Sapta Bhajana Kottalapalli

సప్త భజన కార్యక్రమం Sapta Bhajana Programme

31 ఆగస్టు — 07 సెప్టెంబర్ 2026 31 AUG — 07 SEP 2026

🙏 కొట్టాలపల్లి శివాలయం 🙏 Kottalapalli Shiva Temple

మన గ్రామం కోసం… మన రైతుల కోసం… వర్షాల కోసం… శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి కృపను కోరుతూ ఈ సప్త భజన కార్యక్రమం నిర్వహించబడుతుంది. For our village… for our farmers… for rain… This Sapta Bhajana programme seeks the blessings of Sri Uma Maheshwara Swamy.

గురించిAbout

వర్షాల కోసం ఒక ప్రార్థన A Prayer for Rain

మన కొట్టాలపల్లి గ్రామంలో ప్రస్తుతం సరైన వర్షాలు లేకపోవడంతో పొలాలు ఎండిపోతున్నాయి. వర్షాల కోసం ఎదురుచూస్తున్న మన రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. Kottalapalli is currently facing a lack of adequate rainfall. The fields are drying up, and our farmers are facing difficulties while waiting for the rains.

ఈ పరిస్థితుల్లో మన గ్రామానికి సమృద్ధిగా వర్షాలు కురవాలని, పంటలు పండాలని, రైతుల కష్టాలు తొలగాలని, గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని శ్రీ ఉమామహేశ్వర స్వామిని ప్రార్థిస్తూ ఈ సప్త భజన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. గ్రామ ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో పాల్గొని ఈ పవిత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. With prayers for abundant rainfall in our village, good crops, relief from the difficulties faced by our farmers, and the happiness and well-being of all our villagers, we are organising this Sapta Bhajana programme seeking the blessings of Sri Uma Maheshwara Swamy. We sincerely request all the people of Kottalapalli to participate in this sacred programme with devotion and help make it successful.
కార్యక్రమ వివరాలుProgramme Details

తేదీలు & సమయాలు Dates & Timings

📅
వ్యవధిDuration
31 ఆగస్టు – 07 సెప్టెంబర్ 2026 31 August – 07 September 2026
📍
స్థలంVenue
కొట్టాలపల్లి శివాలయం Kottalapalli Shiva Temple
🕓
ప్రారంభ సమయంStart Time
31 ఆగస్టు 2026, తెల్లవారుజామున 4:30 గం. 4:30 AM on 31 August 2026
3వ శ్రావణ సోమవారం 3rd Shravan Monday
🛕
ప్రతిరోజూEvery Day
ఉదయం 5:00 గం. — శివునికి అభిషేకం 5:00 AM — Abhishekam to Lord Shiva
🌾
ప్రార్థనOur Prayer
వర్షాలు · పంటలు · రైతుల శ్రేయస్సు Rain · Crops · Farmers' Welfare
🏺
07 సెప్టెంబర్ 2026 07 September 2026
పూర్ణ కుంభ కలశాల ఊరేగింపు — ఉదయం 4:00 గం. Purna Kumbha Kalasha Procession — 4:00 AM
గ్రామ ప్రజలందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాము. All villagers are warmly requested to participate and help make it successful.
ఆహ్వానంInvitation

గ్రామ ప్రజలకు ఆహ్వానం Invitation to the Village Community

మన గ్రామ శివాలయం నందు 3వ శ్రావణ సోమవారం, అనగా 31-08-2026 తేదీన తెల్లవారుజామున 4:30 గంటల నుండి సప్త భజన కార్యక్రమం ప్రారంభమవుతుంది. కావున మన గ్రామ ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని, భక్తిశ్రద్ధలతో భజనలో భాగస్వాములై, శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి కారుణ్య కటాక్షములు పొంది, స్వామి కృపకు పాత్రులు కావాలని మరిమరి కోరుతున్నాము. The Sapta Bhajana programme will begin at 4:30 AM on 31 August 2026 at the Kottalapalli Shiva Temple, on the 3rd Shravan Monday. We warmly request all the people of our village to participate in the programme with devotion, join the bhajans, and seek the compassionate blessings of Sri Uma Maheshwara Swamy.

ఇట్లు, గ్రామ ప్రజలు — పెద్దకొట్టాలపల్లి With regards, The People of Peddakottalapalli

మీ వంతు సహాయంSupport the Programme

మీకు తోచిన విధంగా సహకరించండి Contribute in Whatever Way You Can

ఈ కార్యక్రమం గ్రామ ప్రజల సహకారంతో నిర్వహించబడుతుంది. మీకు తోచిన విధంగా మీ వంతు సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. దానం చేయగలిగే వస్తువులు: This programme is being organised with the support of our village community. We sincerely request everyone to contribute in whatever way they can. You may contribute any of the following:

💰 డబ్బులుMoney 🌾 బియ్యంRice 🍬 చక్కెరSugar 🍯 బెల్లంJaggery 🫘 కందిపప్పుToor Dal 🫘 శెనగపప్పుChana Dal 🍚 బొరుగులుPuffed Rice 🥬 ఆకుకూరలుLeafy Vegetables 🥕 కూరగాయలుVegetables 🥛 పాలుMilk 🍶 పెరుగుCurd 🍃 విస్తరి ఆకులుLeaf Plates
దాతలకు ప్రత్యేక గుర్తింపుDonor Recognition

Top 20 దాతల జాబితా Top 20 Donors List

📸
Instagram లో ప్రచురణ Featured on Instagram
సప్త భజన కార్యక్రమానికి అత్యధికంగా విరాళం అందించిన Top 20 దాతల జాబితాను మన Mana Kottalapalli Instagram పేజీలో ప్రత్యేకంగా ప్రచురించడం జరుగుతుంది. The Top 20 donors who make the highest contributions will be featured on the Mana Kottalapalli Instagram page.
🌐
వెబ్‌సైట్‌లో ప్రదర్శన Listed on Website
Mana Kottalapalli వెబ్‌సైట్‌లోని Donors List విభాగంలో కూడా Top 20 దాతల వివరాలను ప్రదర్శించడం జరుగుతుంది. దాతల జాబితాలో మీ పేరు ఎలా ప్రదర్శించాలో, చెల్లింపు స్క్రీన్‌షాట్ పంపేటప్పుడు తెలియజేయవచ్చు. The Top 20 donor details will also be displayed in the Donors List section of the website. Let us know how you'd like your name displayed when you send your payment screenshot.
సంప్రదించవలసిన వారుContact Us

ఏవైనా సందేహాలుంటే Have Questions?

ఓం నమఃశివాయ · Om Namah Shivaya
మన గ్రామం • మన భక్తి • మన ఐక్యత Our Village • Our Devotion • Our Unity

వర్షాలు కురవాలి • పంటలు పండాలి • రైతులు సంతోషంగా ఉండాలి • మన గ్రామం సుభిక్షంగా ఉండాలి May the rains come, crops flourish, our farmers prosper, and Kottalapalli remain blessed.

ప్రతి షేర్ ఈ ప్రార్థనను మరింత దూరం చేరుస్తుంది Every share carries this prayer further

కొట్టాలపల్లి చుట్టుపక్కల ప్రతి ఇంటికి ఇది చేరేలా సహాయం చేయండి. Help this reach every household in and around Kottalapalli.